రోజాకు ‘జబర్దస్త్’ కౌంటర్లు..నాగబాబు వార్నింగ్!

-

ఏపీ రాజకీయాల్లో మంత్రి రోజా ఫైర్ బ్రాండ్ నాయకురాలు అనే సంగతి తెలిసిందే. ప్రత్యర్ధులు ఎవరైనా సరే విరుచుకుపడటం ఆమె వంతు. ఇక అధికారంలోకి వచ్చాక..మంత్రి అయ్యాక ఓ రేంజ్‌లో ప్రత్యర్ధులని పరుష పదజాలంతో దూషిస్తూ ముందుకెళుతున్నారు. చంద్రబాబు, పవన్, లోకేష్…ఈ ముగ్గురుని సమయాన్ని బట్టి ఓ రేంజ్ లో తిడుతున్నారు. తాజాగా బాబు, పవన్‌లపై విరుచుకుపడ్డారు. అలాగే వారి ఓటమిలపై విమర్శలు గుప్పించారు.

స్థానిక ఎన్నికల్లో కుప్పం ప్రజలు తంతే బాబు వెళ్ళి  హైదరాబాద్‌లో పడ్డారని, కుప్పంలో కూసాలు కదులుతున్నాయని మాట్లాడారు. అటు పవన్‌ని సొంత జిల్లా ప్రజలు ఓడించారని కామెంట్ చేశారు. ఇక వీరి పరంగా రాజకీయ విమర్శలు చేయడంలో ఇబ్బంది లేదు..కానీ రోజా..రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని కూడా విమర్శించారు. చిరంజీవిని సైతం సొంత జిల్లా ప్రజలు ఓడించారని, 2009లో పాలకొల్లులో ఓటమిని గుర్తు చేశారు. ఇటు 2019 ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి నాగబాబు ఓడిపోయిన విషయాన్ని కూడా చెప్పారు. ఇలా మెగా బ్రదర్స్‌ని సొంత జిల్లా ప్రజలు ఓడించారని విమర్శించారు.

ఇక సినిమా వాళ్ళు చాలా సెన్సిటివ్ అని, ఎదుటవారికి సాయం చేస్తారని, కానీ మెగా ఫ్యామిలీ అలా చేసినట్లు తాను చూడలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే చిరంజీవిని విమర్శించడంపై రోజాకు కౌంటర్లు పడుతున్నాయి. తాజాగా రోజాపై జబర్దస్త్ గెటప్ శ్రీను ఫైర్ అయ్యాడు.

“చిరంజీవి గారి సేవా గుణం, దాన గుణం తెరిచిన పుస్తకం. ఒక స్ఫూర్తి..మరి మీకెందుకు కనపడలేదో? రోజగారు ఒక్కసారి ఆత్మపరిశీలన చేస్కోండి …మీ ఉనికి కోసం ఆయన మీద విమర్శలు చేసి ప్రజల్లో మీ మీదున్న గౌరవాన్ని కోల్పోకండి .మీ నోటనుండి ఇంత పచ్చి అబద్దాన్ని వినాల్సివస్తుందని అనుకోనేలేదు .దయచేసి మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీస్కోండి.” అంటూ శ్రీను..రోజాకు కౌంటర్ ఇచ్చాడు.

అటు నాగబాబు సైతం రోజాపై ఫైర్ అయ్యారు. “మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్, మా అన్నయ్య చిరంజీవి గురించి నోటికొచ్చినట్లు వాగినా కూడా నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదంటే.. ఒకటే ఒక్క కారణం ఉంది. నీ నోటికి మున్సిపాలిటీ కుప్పతొట్టికి పెద్ద తేడా లేదు.. చూస్తా చూస్తా మున్సిపాలిటీ కుప్పతొట్టిని గెలకరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటకశాఖను ఎలా డెవలప్‌ చేయాలో చూడు’అంటూ ఫైర్ అయ్యారు. అట్టడుగున ఉన్న పర్యాటక రంగాన్ని ఎలా పైకి లేపాలో ఆలోచించు అంటూ కౌంటర్ వేశారు. మొత్తానికి మెగా ఫ్యాన్స్ సైతం రోజా టార్గెట్ గా విరుచుకుపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version