కేసీఆర్ సర్కార్ ఎప్పుడు కూలుతుందో తెలీదు.. జాగ్రత్తగా ఉండండి : నాగం

-

కేసీఆర్ సర్కార్ ఎప్పుడు కూలుతుందో తెలీదు.. అధికారులంతా చాలా జాగ్రత్తగా ఉండాలని మాజీ మంత్రి నాగం జనార్ధర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ సర్కార్ శాశ్వతం కాదు.. అధికారులు జాగ్రత్తగా పనిచేయాలని పేర్కొన్నారు. ఇవాళ మాజీ మంత్రి నాగం జనార్ధర్‌ పాలమూరు అభివృద్ధి పై మాట్లాడూతూ..టీఆర్‌ఎస్‌ మంత్రులు ఇష్టా రాజ్యాంగ మాట్లాడటం మానుకోవాలని.. కృష్ణా నది జలాలతో రాయల సీమను రతనాల సీమ చేస్తా అని సీఎం కేసీఆర్‌ చెప్పలేదా..? అని ప్రశ్నించారు.

సంగమేశ్వర ప్రాజెక్ట్ నామ కారణమే ప్రగతి భవన్ లో జరిగిందని.. జగన్ పోతిరెడ్డిపాడు గురించి మాట్లాడితే… కెసిఆర్ అదెందుకు సంగమేశ్వర ప్రాజెక్ట్ పెట్టుకోండి అని చెప్పలేదా..? అని నిలదీశారు. ఇరిగేషన్ ప్రాజెక్టులపై అసలు టీఆరెఎస్ ఎమ్మెల్యే లకు, మంత్రులకు తెలుసా… మంత్రి నిరంజన్ రెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై అవగాహన తెచ్చుకోవాలని చురకలు అంటించారు.

కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ హయంలోనే పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ హయంలోనే పెట్టిన మోటర్లను.. కేసీఆర్ సర్కార్.. కిందికి దింపి నాలుగు బోల్టులు బిగించి కొబ్బరికాయలు కొడ్తున్నారని ఫైర్‌ అయ్యారు. కేసీఆర్ భారతం పట్టేందుకు రేవంత్ పీసీసీ అయ్యాడని… రేవంత్ రెడ్డి పై అనవసర విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version