ఫీలింగ్ శాడ్ అంటూ ఎమోషనల్ అయిన నాగ్ !

-

అదేంటి నాగార్జున సాడ్ గా ఫీల్ అవడం ఏంటి. ఆయనకు ఏమైంది ? అనుకుంటున్నారా. అయితే మీరు భయపడాల్సిన విషయం అయితే ఏమీ లేదండి. ఆయన ప్రస్తుతం వైల్డ్ డాగ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ కాప్ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం కులుమనాలి లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ షూటింగ్ కోసం బిగ్ బాస్ హోస్టింగ్ ని వదిలేసి మరి నాగార్జున కులు మనాలి వెళ్ళాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఒక వారం సమంత మేనేజ్ చేసినా ఆమె కంటే నాగార్జున బెటర్ అనిపించారు. దీంతో రెండో వారానికి మళ్లీ ఆయనని స్పెషల్ ఫ్లైట్ లు వేసి మరీ రప్పించారు నిర్వాహకులు. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మనాలీలో వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ పూర్తయిందట, షూటింగ్ పూర్తి కావడంతో ఇంటికి బయలుదేరుతున్నాను అని నాగార్జున కొద్దిసేపటి క్రితమే ట్వీట్ చేశాడు. వైల్డ్ డాగ్ సినిమా కోసం నా షూటింగ్ పూర్తయింది, ఇంటికి బయలు దేరుతున్నా, కానీ నా టాలెంటెడ్ టీంకి అలానే హిమాలయాలకి గుడ్ బాయ్ చెప్పటం బాధగా ఉందని ఆయన ట్వీట్ చేశాడు. ఇక ఆయన బయలుదేరుతున్నాడు అంటే ఈ రోజు కూడా ఆయన బిగ్ బాస్ షోలో కనువిందు చేసేది నాగార్జునే అని ఫిక్స్ అయిపోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version