ఇదేం పిచ్చిరా నాయనా.! నాగిని డాన్స్‌ కోసం నాగుపాము..

-

బుర్రకో బుద్ధి జివ్వకో రుచి అన్నట్లు ఒక్కొక్కరిది ఒక్కో అలోచన. అయితే ఆ అలోచనతో వారికి కలిగే ముప్పును మాత్రం పట్టించుకోరు. మామూలుగా పెళ్లి బరాత్‌లో నాగిని డాన్స్‌ ఎంత ఫేమస్సో మనం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి బరాత్‌లో నాగిని డాన్స్ ప్రత్యేకం. అయితే ఇక్కడ ఓ పెళ్లి బరాత్‌లో నాగిని డాన్స్ కోసం ఏకంగా నాగుపామును తీసుకువచ్చారు. చివరకు జైలు పాలయ్యారు. ఈ ఘటన ఒడిశాలోని మయూర్ భంజ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వివాహ వేడుక కోసం పాములు పట్టే వ్యక్తిని పిలిపించి, నాగిని డ్యాన్స్ చేయించారు.

ఆ వ్యక్తి బుట్టలో పామును పెట్టుకుని నాగిని డ్యాన్స్ చేస్తుండగా.. మిగిలిన వాళ్లు చుట్టూ చేరి ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వీటిని చూసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి, పామును ఆడించిన వ్యక్తితో పాటు ఐదుగురిని అరెస్ట్ చేసి, కటకటాల వెనక్కి నెట్టారు. పామును అటవీశాఖ అధికారులకు అందించారు. వన్యప్రాణుల చట్టం ప్రకారం పామును అలా ఆడించడం దాన్ని హింసించడం అవుతుంది. అంతేకాదు, ఆ పాము వల్ల జనాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version