విషమంగా నాయిని ఆరోగ్యం.. ఆసుపత్రికి క్యూ కట్టిన అగ్రనేతలు !

-

టీఆర్ఎస్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం విషమించిన సంగతి తెలిసిందే. న్యుమోనియా కారణంగా ఆయన ప్రస్తుతం జూబ్లిహిల్స్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 28వ తేదిన కరోనా బారిన పడిన నాయిని చికిత్స తీసుకుని కోలుకున్నారు. పది రోజుల తర్వాత ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. మళ్ళీ ఆయనకి ఉపిరి తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడంతో నాయిని జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

ఆయన అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌ లో వెంటిలేటర్‌ మీద ఉన్నారు. దీంతో ఆయనను పరామర్శించేందుకు టీఆర్ఎస్ అగ్రనేతలు క్యూ కట్టారు. నిన్న నాయినిని మంత్రి కేటీఆర్, మేయర్ బొంతు రామ్మోహన్ పరామర్శించారు. ఈరోజు ఉదయం మంత్రి నిరంజన్ రెడ్డి, హరీష్ రావులు కూడా నాయిని నర్సింహ్మారెడ్డిని పరామర్శించారు. ఈ సంధర్భంగా వైద్యానికి ఆయన సరిగా స్పందించడం లేదని వైద్యులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version