కరోనా వైరస్ వ్యాపించిన సమయంలో భారత విధానాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రసంశలు వచ్చాయి. సామాజిక దూరం పాటించే వారు ఎక్కువగా భారత విధానాలను అనుసరించడం మొదలుపెట్టారు. దేశాధినేతలు కూడా స్వాగతం పలికే క్రమంలో ఎక్కువగా నమస్తే చేస్తూ వచ్చారు. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో ఒక దేశాధినేత నమస్తే చేస్తున్న విధానంపై ప్రసంశలు వస్తున్నాయి.
ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ జర్మన్ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ ను భారతీయ విధానంలో నమస్తే చెప్పారు. ఈ వీడియోని మాక్రాన్ ట్వీట్ చేసారు. ఇది విస్తృతంగా వైరల్ అవుతుంది. పలువురు దేశాధినేతలు కూడా ఇదే విధానం అనుసరిస్తున్నారు.
Willkommen im Fort de Brégançon, liebe Angela! pic.twitter.com/lv8yKm6wWV
— Emmanuel Macron (@EmmanuelMacron) August 20, 2020
eman