కరీంనగర్ జిల్లా : హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక నామినేషన్ల పర్వం కాసేపటి క్రితమే ముగిసింది. ఇక ఈ హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక లో ఏకంగా 26 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఇవాళ ప్రధాన పార్టీ లు అయిన బిజెపి, కాంగ్రెస్, మరియు టిఆర్ఎస్ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
టిఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ మరోసారి నామినేషన్ దాఖలు చేయగా .. గెల్లు శ్రీనివాస్ వెంట నామినేషన్ కేంద్రానికి తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, పాడి కౌశిక్ రెడ్డి వచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలు మూరి వెంకట్ నామినేషన్ దాఖలు చేయగా .. నామినేషన్ కు కేంద్రానికి కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ మరియు దామోదర రాజా నర్సింహా వెంట వచ్చారు.
అటు ఈటెల జమున మరియు ఈటెల రాజేందర్ నామినేషన్ వెయ్యగా.. ఈటల రాజేందర్ వెంట కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చారు. కాగా హుజురాబాద్ నియోజక వర్గ ఉప ఎన్నిక అక్టోబర్ 30 న జరుగనుండగా.. నవంబర్ 3 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.