వంద మంది కలిసివచ్చినా జగన్ వెంట్రుక కూడా పీకలేరని నందిగం సురేష్ అన్నారు. ఓటుకు నోటు కేసులో అర్ధరాత్రి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని.. జగన్ సింగిల్ గా వచ్చి పోటీ చేశారని కొనియాడారు. 2014, 2019 లో సింగిల్ గానే పోటీ చేశాం.. టిడిపి మాదిరి పొత్తులకు వెంపర్లాడలేదని ఫైర్ అయ్యారు. టిడిపి సోషల్‌మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు.. అత్యాచారాలు,మహిళలపై దాడులంటూ ప్రభుత్వాన్ని విమర్శించాలని చూస్తున్నారని అగ్రహించారు.
గత ప్రభుత్వంలో ఎన్నో కష్టాలు పడ్డాం.. గతంలో అగ్రవర్ణాలకు మాత్రమే పదవులు దక్కేవి అని తెలిపారు. జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోంది.. పేదలకు డబ్బులిస్తే సోంబేరుల్లా మారుతారని వ్యాఖ్యానిస్తున్నారని చెప్పారు. అలసి పోయిన వారికి బాసటగా ఉంటుందని సిఎం జగన్ ఆలోచన అని.. చంద్రబాబు కు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని మండిపడ్డారు. ఇంటింటికి తిరిగి రండి కలసి రండి అని అడుక్కుంటున్నాడు.. చంద్రబాబు రెండు రోజులు తిరిగి కోతిలా మారాడని విమర్శించారు. లోకేష్ మూర్ఖుడని చెప్పుకుండున్నారు..ఆయనే మూర్ఖుడే కాదు.. పప్పు కూడా అని చురకలు అంటించారు.