NANI : ఈ ‘దసరా’ నిరుడు లెక్క ఉండదంటున్న నాని!

-

NANI: న్యాచురల్ స్టార్ నాని.. చూడ‌డానికి ప‌క్కింటి అబ్బాయిలా క‌నిపించే ఈ యంగ్ హీరో.. విన్నూత‌మైన‌.. విభిన్న‌మైన పాత్ర‌లు, సోర్టీలు చేస్తూ.. అభిమానుల మ‌న‌సుల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటున్నాడు. వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నా.. ఇటీవ‌లి కాలంలో నానికి స‌క్సెస్ అనేది అంద‌ని ద్రాక్ష‌గా మారింది.

ఒక‌వైపు ఆయ‌న సినిమాలు వీ, టక్ జగదీష్ ఓటీటీలో విడుద‌ల అవుతున్నాయ‌నే విమ‌ర్శ‌లు, మ‌రోవైపు చిత్రాలు స‌రైన సక్సెస్‌లు సాధించ‌క‌పోవ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. అయినా త‌గ్గ‌దేలే అన్నట్టు ఉన్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి అయిన శ్యామ్ సింగ రాయ్ అంటూ థియేటర్లో పలకరించేందుకు సిద్దమ‌య్యారు.

తాజాగా నాని 29వ సినిమాకు రెడీ అవుతున్నారు. దసరా సందర్భంగా నాని తన అభిమానులకు క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. ద‌స‌రా అనే టైటిల్‌తో నాని 29వ మూవీ తెర‌కెక్క‌బోతుంది. ఈ చిత్రంలో కీర్తి సురేష్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండ‌గా.. శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమాను పోస్ట‌ర్‌లో నాని రగ్డ్ లుక్‌తో క‌నిపిస్తుండ‌గా, ఈ దసరా నిరుడు లెక్క ఉండదు.. అంటూ ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు.

http://<iframe width=”640″ height=”360″ src=”https://www.youtube.com/embed/retamiUoLEI” title=”YouTube video player” frameborder=”0″ allow=”accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture” allowfullscreen></iframe>

ఈ పోస్టర్‌తో పాటు ఓ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు. ఇందులో సినిమాలోని నేపథ్యం, కాన్సెప్ట్‌ను ఎలా ఉంటుందో ఓ చిన్న హింట్ ఇచ్చారు. అలాగే.. నాని, కీర్తి సురేష్ లుక్ కూడా చూపించారు. ప‌క్కా గ్రామీణ తెలంగాణ నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తోన్న‌ట్టు క‌నిపిస్తుంది. ‘ఈ దసరా నిరుడు లెక్కుండది.. బాంచత్.. జమ్మివెట్టి చెబుతున్నా.. బద్దల్ బాసింగలైతయ్.. ఎట్లైతే గట్లైతది.. సూసుకుందాం’ అంటూ తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్ అదిరిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version