Online tickets : చిరంజీవి కి కౌంటర్ ఇచ్చిన మంత్రి పేర్ని నాని

-

ఆంధ్ర ప్ర‌దేశ్ లో ఆన్‌లైన్ టికెట్స్ వేడీ పెరుగుతుంది. ఇప్ప‌టి కే ప‌లువురు సెల‌బ్రెటీ లు, రాజ‌కీయ నాయ‌కులు దీని పై స్పందిచారు. అలాగే మెగా స్టార్ చిరంజీవి కూడా ట్విట్ట‌ర్ వేదిక గా స్పందించాడు. అయితే చిరంజీవి ట్వీట్ పై మంత్రి పేర్ని నాని కౌంట‌ర్ ఇచ్చాడు. జీవో 35లో కొన్ని మార్పులు చేయాలని గతంలో సీఎం దృష్టికి తీసుకు వ‌చ్చింది చిరంజీవి యే అని మంత్రి పేర్ని నాని అన్నారు.

గ‌తంలో చిరంజీవి తో పాటు మ‌రి కొంత మంది సినిమా పెద్ద‌లు, ఎగ్జిబిట‌ర్లు త‌మ దృష్టి కి తీసుకువ‌చ్చార‌ని మంత్రి పేర్ని నాని గుర్తు చేశారు. వారి తో అప్ప‌డే చెప్పాం.. టికెట్లు రేట్ల పెంపు అంశంలో లోతు గా పరిశీలన చేసిన త‌ర్వాతే నిర్ణయం తీసుకుంటామ‌ని చెప్పాం. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు లేకుండా టికెట్ల పెంపుపై ముఖ్య మంత్రి తో చర్చించి చెప్తామని సినీ పెద్దలకు చెప్పాన‌ని అన్నారు. కానీ చిరంజీవి ఇలా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాద‌ని అన్నారు. అయితే చిరంజీవి ట్వీట్ట‌ర్ వేదిక గా టికెట్ల ధ‌ర ల పై మ‌రో సారి ఆలోచించాల‌ని ప్ర‌భుత్వాన‌కి విజ్ఞాప్తి చేశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version