ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది అనే వార్తలు కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడ్ని చంద్రబాబు మార్చే ఆలోచనలో ఉన్నారు అని యువనేతకు ఇవ్వాలి ఆయన భావించారు అని అంటున్నారు. ఇక రామ్మోహన్ నాయుడుకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే విధంగా ఆయన అడుగులు వేసారు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
దీనిపై విజయవాడ ఎంపీ కేసినేని నానీ అసహనంగా ఉన్నారు అని సమాచారం. కేసినేని నానీ ఇటీవల చంద్రబాబుని కలిసిన సమయంలో తనకు అధ్యక్ష పదవి కావాలి అని కోరారు అని అయితే యువనేతకు ఇవ్వాల్సిన అవసరం ఉందని అందుకే యువనేతకు అధ్యక్ష పదవిని తాను ఇస్తున్నట్టు చెప్పారట. ఇదే విషయం గల్లా జయదేవ్ కూడా అసహనంగానే ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి.
విజయవాడలో ఎదురు గాలి ఉన్న గుంటరు జిల్లాలో ఎదురు గాలి ఉన్నా సరే తాము నిలబడి గెలిచామని ఇప్పుడు తాము అన్యాయం అవుతున్నాము అనే భావన లో ఆ ఇద్దరు ఉన్నారు అని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆయనను బుజ్జగించే కార్యక్రమం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా అసలే ఇబ్బంది పడుతున్న తరుణంలో చంద్రబాబుకి ఈ వ్యవహారం తల నిప్పిగా మారింది.