ప్రముఖ దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ నోవాల్ టాటా ఇక లేరనే విషయాన్ని దేశంలోని ప్రముఖులు, ఆయన్ను వ్యక్తిగతంగా ప్రేమించి, ఆరాధించే వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఆయన పెళ్లి కూడా చేసుకోకుండా జీవితకాలం దేశం కోసం, ఇక్కడి ప్రజల శ్రేయస్సు కోసం ఎంతో శ్రమించారు. ఎన్నో ట్రస్టులు స్థాపించి ఆయన సంపాదనలో 65 శాతానికి పైగా దానం చేసేవారు.
ఇక గతంలో పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఆయన నానో కారును లాంచ్ చేసిన విషయం తెలిసిందే. కారు అనేది పేదలు, దిగువ మధ్య తరగతి వారికి ఎప్పటికీ కలే. అటువంటి వారు కారులో తిరగాలని టాటా కల గన్నారు.అందుకోసం రూ.2లక్షల లోపు కారును తయారు చేశారు.2008లో రతన్ టాటా నానో కారును తీసుకొచ్చారు. స్కూటర్ల మీద పేరెంట్స్ తమ పిల్లలను తీసుకెళ్లడాన్ని గమనించి తక్కువ ధరకు నానో కారును పరిచయం చేసినట్లు ఓ ఇంటర్వ్యూలో టాటా చెప్పుకొచ్చారు. అయితే, మార్కెట్లో నానో కార్ ఫెయిల్ అవ్వడం, డిమాండ్ తగ్గడంతో ఆ కారు ఉత్పత్తిని నిలిపివేసిన విషయం తెలిసిందే.