ఎన్ని కష్టాలు ఎదురైనా అడుగు ముందుకే: నారా భువనేశ్వరి

-

రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోందని నారా భువనేశ్వరి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధిపై ధ్యాసే లేదని దుయ్యబట్టారు. ‘ఏ ఆధారాలు లేని స్కిల్, రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో చంద్రబాబును ఇరికించారు. రాష్ట్రాన్ని, న్యాయాన్ని జైలులో నిర్భందించారు. తెలుగువారి పౌరుషం ఏంటో ఎన్టీఆర్ చూపించారు. ఎన్ని కష్టాలు వచ్చినా అడుగు ముందుకే వేద్దాం’ అని నిజం గెలవాలి యాత్రలో ఆమె అన్నారు. నిజం గెలవాలి బహిరంగ సభ ప్రాంగణానికి నారా భువనేశ్వరి చేరుకున్నారు. జనం మధ్య నుంచి భువనేశ్వరి వేదిక పైకి నడచి వచ్చారు. టీడీపీ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎన్టీఆర్‌కు దీపం పెట్టీ, కొబ్బరి కొట్టి ఆమె నివాళులు అర్పించారు. “హుందా తనానికి మారు పేరు మీరు.

మిమ్మల్ని కుంగతీయటానికి ఎంతోమంది ప్రయత్నిస్తున్నారు. మా కోసం, ప్రజలకోసం, రాష్టం కోసం మీరు దైర్యంతో వచ్చినందుకు నమస్కరిస్తూ మీ వెంటే ఉంటానని మాట ఇస్తున్నాం. మహిళను అవమానిస్తే తీవ్రంగా శిక్ష వేసే చట్టం వచ్చేలా చేయాలి.” అని పులివర్థి సుధా రెడ్డి అన్నారు. తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటన ఖరారైంది. ఈ మూడు రోజులూ ఉదయం నుంచీ మధ్యాహ్నం వరకూ చంద్రబాబు అరెస్ట్‌ను తట్టుకోలేక మృతి చెందిన టీడీపీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొన్నారు. తొలి రోజైన బుధవారం 25న చంద్రగిరిలో సమావేశంలో పాల్గొన్నారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలో నారా భువనేశ్వరి పర్యటించనున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version