గతంలో వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్న సమయంలో అసెంబ్లీ వేదికగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సతీమణి నారా భువనేశ్వరిని అవమానించారని.. వారంతా ఇప్పుడు అనుభవిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.
వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆనాడు హద్దులు మీరారని, తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి, పేర్ని నాని, జోగి రమేశ్, అంబటి రాంబాబు వీరందరి వెనుక ఉండి వారితో తప్పులు చేయించింది ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ అని ఆరోపించారు. మాజీ సీఎం జగన్, సజ్జల ఇద్దరూ కలిసి వారి నేతల చేత చంద్రబాబు కుటుంబాన్ని తిట్టించారని బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
ఆ రోజు అసెంబ్లీలో నారా భువనేశ్వరిని అవమానించారు.. ఇప్పుడు అనుభవిస్తున్నారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
వల్లభనేని వంశీ, కొడాలి నాని హద్దులు మీరారు
తప్పు చేసిన వాళ్లు తప్పించుకోలేరు
వల్లభనేని వంశీ, పోసాని, పేర్ని నాని, జోగి రమేశ్, అంబటి రాంబాబు.. అందరి వెనుక సజ్జల ఉన్నారు
జగన్,… pic.twitter.com/d3Y7ufLk2R
— BIG TV Breaking News (@bigtvtelugu) March 2, 2025