మొత్తానికి తెలుగు దేశం పార్టీలో మార్పు మొదలైంది.. మార్పు అంటే అట్టా ఇట్టా కాదండీ బాబు. ఓ లెవల్లో.. అంతకు మించి..
తెలుగుదేశం పార్టీని రీమోడలింగ్ చేసే పనిని చాలా సీరియస్ గానే చంద్రబాబు తీసుకున్నట్టుగా కనిపిస్తున్నారు. ఏదో ఆషామాషీగా అయితే సైకిల్ పార్టీకి రిపేర్లు చేయడం లేదు. మార్పు తమ నుంచే మొదలు కావాలని చెప్పిన తండ్రి మాటను తూచా తప్పకుండా పాటించేసి.. స్లిమ్ముగా తయ్యారయ్యాడు. అసలు ఆ స్లిమ్ బాడీని చూసి ఎవరో టాలీవుడ్ హీరో అని అంత బ్రమ పడిపోగా, దగ్గర నుంచి చూస్తే కానీ సినబాబు ఎవరూ గుర్తు పట్టలేనంతగా అయిపోయారు. అక్కడే తొలి అడుగు పడింది.. తమ విధేయులనుండి చప్పట్లో హోరు ఇక సినిబాబు ఏదో ఒకటి చేసేసి పార్టీని పరిగెత్తించాలని కంకణం కట్టుకుని రంగంలోకి దిగాడు.
ఇక సైకిల్ పార్టీకి రిపేరు చేసే క్రమంలో చంద్రబాబు ఎడాపెడా పార్టీలోని పదవులను ప్రక్షాళన చేసి పారేశారు. సీనియర్లు చాలామంది ఉన్నా, వారు తమకు ఎందుకు ఉపయోగపడరని, వారికి పదవులు ఇచ్చి మెరుగులు దిద్దినా, ప్రయోజనం ఉండదనే ఆలోచనతో పూర్తిగా పక్కన పెట్టేసి, ఎవరెవరినో తీసుకొచ్చి, పార్టీలో అగ్రతాంబూలం ఇచ్చేసరికి మొదటి నుంచి తాము బాబు బ్యాచ్ అని డప్పు వేసుకుని మరీ చెప్పుకున్న వారంతా, ఇప్పుడు కారాలు, మిరియాలు నూరిపోస్తున్నారు . అసలు ఇదంతా పక్కన పెట్టేస్తే, అందర్నీ ఎడాపెడా మార్చడమే కాదు, ఇప్పుడు సైకిల్ పార్టీ సింబల్ ని కూడా మార్చి చేసినట్టుగా సిన బాబు ట్విట్టర్ అకౌంట్ చూస్తే అర్థమవుతోంది. ఓల్డ్ మోడల్ సైకిల్ తో ఇప్పుడు లాభం లేదు అనుకున్నారో ఏమో కానీ, సరి కొత్త యూత్ మోడల్ సైకిల్ లోగోను వాడేస్తున్నారు.
అసలే టెక్నాలజీ కి మారుపేరు అని డప్పు కొట్టుకొనే బాబు గారు, ఐటీ మంత్రిత్వశాఖ వెలగబెట్టిన సినబాబు గారు మొత్తానికి గట్టిగానే కష్టపడి కొత్త లోగోను డిజైన్ చేసినట్టుగా కనిపిస్తున్నారు. అయితే పార్టీ సింబల్ మారినా, సినబాబు మారినా, ప్రజల్లో మాత్రం సైకిల్ పార్టీపై ఉన్న వ్యతిరేకత మారలేనట్టుగానే కనిపిస్తోంది. ఇప్పుడు అకస్మాత్తుగా టిడిపి లోగో ను చూసిన వారు ఏమిటి ? పార్టీ లోగో ను మాత్రమే మార్చారా లేక సినబాబు ఏమైనా కొత్త పార్టీ పెట్టేశాడా అని కాస్త కంగారు పడుతున్నార ట. అయితే చంద్రబాబుకు కొత్త పార్టీ పెట్టే అంత సీన్ లేదు అని, ఏదో సరదాగా సింబల్ మార్చి పెట్టారు అంటూ, తెలుగు తమ్ముళ్లు సిన బాబు పై సెటైర్లు వేసేస్తున్నారట.
సిన బాబు అప్‌డేట్ అవ్వడమేకాదు లోగోను మార్చేశాడు, పార్టీకి మరింత ఊపు తీసుకువచ్చే ప్రయత్నం మామూలుగా చెయ్యలేదు. ఇక నుండి ఉరుకులు పరుగులే… అంతేగా మరి.. పాత డొక్కు సైకిల్ లోగోలో నుండి తీసి అవతల పారేసి, తన మార్కు సైకిల్‌ని లోగోలోకి ఎక్కించేశాడు. సినబాబు నువ్వు సూపరో సూపరు. సైకిల్ ఏందుకు సామీ ఏకంగా ఏ రాకెట్‌నో, రాయల్ ఎన్‌ఫీల్డ్‌నో వాడేస్తే సరిపోయేదిగా, విజన్ 4040 అనే స్లోగన్ వాడేస్తే ఇక తిరుగే ఉండదు.