టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే.. చంద్రబాబు అరెస్టై నెల రోజులవుతున్నా.. ఆయన బెయిల్ మంజూరు కాలేదు. అయితే.. ఈ రోజుల చంద్రబాబు బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అయితే.. ఢిల్లీలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సుప్రీంకోర్టును ఆశ్రయించి చంద్రబాబును బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ రోజు ఢిల్లీ నుంచి నారా లోకేశ్ విజయవాడకు రానున్నారు. ఇప్పటికే ఆయన ఢిల్లీ విమానాశ్రయం నుంచి విమానంలో బయలుదేరారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణకు హాజరు కావాలని సీఐడీ లోకేశ్‌కు గతంలోనే నోటీసులు ఇచ్చింది.
ఈ కేసులో విచారణ నిమిత్తం ఆయన ఈ రోజు విజయవాడకు చేరుకోనున్నారు. రేపు ఉదయం తాడేపల్లి సిట్ కార్యాలయంలో సీఐడీ విచారణకు ఆయన హాజరవుతారు. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో ఈ నెల 4న విచారణకు హాజరు కావాలని తొలుత సీఐడీ నోటీసులు ఇచ్చింది. దీనిపై లోకేశ్ న్యాయస్థానానికి వెళ్లారు. ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ తేదీని 10వ తేదీకి వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాలతో రేపు ఆయన సీఐడీ విచారణకు హాజరవుతున్నారు.