సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతా : లోకేశ్‌

-

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే.. యువగళం పాదయాత్రలో భాగంగా వినుకొండ బహిరంగసభలో నారా లోకేశ్ ప్రసంగించారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతానన్నారని.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నావ్ సీఎం జగన్ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. ఎనిమిదేళ్లపాటు మద్యం మీద వచ్చే ఆదాయాన్ని హామీగా పెట్టి రూ.8 వేల కోట్లకుపైగా అప్పులు తెచ్చారని గుర్తుచేశారు.

ఇక కల్లబొల్లి మాటలు వినిపించుకునే దశలో మహిళలు లేరని లోకేశ్ చెప్పారు. మహిళలను నిలువునా మోసం చేశారని దుయ్యబట్టారు. 2,200 కిలోమీటర్ల పాదయాత్రలో ఓ తల్లి, ఓ చెల్లి కన్నీళ్లు చూశానన్నారు. భవిష్యత్​ గ్యారెంటీ పేరుతో చాలా సంక్షేమ కార్యక్రమాలు ప్రకటించినట్లు లోకేశ్ తెలిపారు. టీడీపీ అధికారానికి వచ్చిన వెంటనే మహిళల ఎదుగుదల కోసం నెలకు రూ.1500 చొప్పున ప్రతీ ఒక్కరికీ ఇస్తామని హామీనిచ్చారు. ఏడాదికి మూడు గ్యాస్​ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున అందిస్తామని లోకేష్​భరోసానిచ్చారు.

 

‘యువత భవిష్యత్​పై సీఎం జగన్​ దెబ్బ కొట్టారు. యువత ఎప్పుడూ పేదరికంలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఎన్నికల వాగ్దానాన్ని విస్మరించారు. ఎన్నికల ముందు ఖాళీగా ఉన్న 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని జగన్​ ఇచ్చిన హామీ ఏమైంది. జాబ్​ క్యాలెండర్​ మర్చిపోయావా. టీడీపీ అధికారానికి రాగానే ముందుగా నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తాం. ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల ద్వారా 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం. అన్నీ జిల్లాల్లో స్టడీ సర్కిల్స్​ నిర్వహిస్తాం.’ అని లోకేష్​ హామీనిచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version