23 ఓట్లతో మా గెలుపు… ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు! అంటూ చురకలు అంటించారు నారా లోకేష్. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ విజయం పై నారా లోకేష్ స్పందించారు.
ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు, మా తెలుగుదేశం కుటుంబసభ్యురాలు పంచుమర్తి అనురాధ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు. మేము 23 సీట్లే గెలిచామని ఎద్దేవ చేశావు. అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నావు అని ఫైర్ అయ్యారు.
చివరికి అదే 23వ తేదీన, అదే 23 ఓట్లతో నీ ఓటమి-మా గెలుపు. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ గారు! అంటూ చురకలు అంటించారు లోకేష్. ఇకనైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని నారా లోకేష్ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయ దుందుభి కొనసాగుతుందని వెల్లడించారు నారా లోకేష్.