టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తండ్రి అరెస్ట్ అయిన తర్వాత తాను ఎలాగైనా బాయిలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడు. అందులో భాగంగానే ఢిల్లీ లో ఉన్న లోకేష్ అన్ని దారులను చూస్తున్నాడు.. తాజాగా ఈ విషయం పైన టీడీపీ ఎంపీ లతో కలిసి వెళ్లిన లోకేష్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం ఏ విధంగా ప్రతిపక్షాలపై అరాచకంగా ప్రవర్తిస్తోందో వివరించినట్లు తెలుస్తోంది. ఇంకా ఈ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదని చూపే అన్ని ఆధారాలను రాష్ట్రపతికి ఇచ్చినట్లు లోకేష్ తెలియచేశారు. ఇక లోకేష్ జగన్ గురించి మాట్లాడుతూ టీడీపీ మీద చంద్రబాబు మీద ఎంతో కసితో ఉన్న జగన్ రెడ్డి కి త్వరలోనే మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ రెచ్చిపోయి మాట్లాడారు.
తన ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి సిద్ధం అయిపోయాడు జగన్ అంటూ నిరంకుశ పాలనను తెలియచేశారు లోకేష్. మరి లోకేష్ చేసిన ఈ ఫిర్యాదు గురించి రాష్ట్ర పతి ఏ విధంగా స్పందిస్తారన్నది తెలియాల్సి ఉంది.