ప్రతి సంవత్సరం దీపావళి కి ముందు వచ్చే రోజు నరక చతుర్దశి ని జరుపుకుంటూ ఉంటాము. నరక చతుర్దశి నాడు కూడా కొన్ని పద్ధతులనూ, ఆచారాలనూ అనుసరించాల్సి ఉంటుంది. చాలా మందికి నరక చతుర్దశి వెనుక ఉన్న కథ గురించి తెలియదు.
నిజానికి నరక చతుర్దశి వెనక చాలా పెద్ద కథ ఉంది. నరక చతుర్దశి తరవాత వచ్చే రోజున దీపావళి పండగ. దీపావళినాడు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరూ ఇంటినిండా దీపాలను వెలిగించి.. ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. ఎలా అయితే మనం దీపావళిని జరుపుకుంటామొ అలానే నరకచతుర్దశి కూడా జరుపుకోవాలి. నరక చతుర్దశి నాడు పాటించే ఆచారాలను తప్పక అనుసరించాలి.
నరకచతుర్దశి వెనుక ఉన్న కథ:
పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే శ్రీ మహా విష్ణువు వరాహ అవతారాన్ని దర్శించినప్పుడు భూదేవికి శ్రీమహావిష్ణువు జన్మించినవాడు నరకాసురుడు. అయితే నరకాసురుడు ఓసారి తపస్సు చేస్తాడు. తపస్సుకు మెచ్చిన శివుడు తల్లి చేతిలో తప్ప ఇంక ఎవరి చేతిలో మరణం లేదని ఈ విధంగా వరాన్ని ఇస్తాడు. ఇంకేముంది నరకాసురుడు దేవతలను, మనుషులను ఎన్నో రకాల బాధలు పెడుతూ ఉంటాడు భూదేవి కూడా నరకాసురుడిని భరించలేకపోతోంది.
పైగా నరకాసురుడు రాజు కూడా అవుతాడు. నరకం అర్థం వచ్చేలాగ ఒక రాజధానిని కూడా ఏర్పాటు చేస్తాడు నరకాసురుడు. దీనితో ఇంకా సమస్యలు పెరిగి పోతూ ఉంటాయి.
సత్యభామ చేతిలో నరకాసురుడు:
శ్రీకృష్ణుడు యుద్ధాన్ని ప్రకటిస్తాడు. సత్యభామగా భూదేవి జన్మించి శ్రీ మహా విష్ణువు కృష్ణుడుగా సత్యభామ తో పాటు వెళ్తాడు. సతీ సమేతంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి వచ్చి ఎగతాళి చేసిన నరకాసురుడిని ఆమె చేతితో చంపేస్తుంది. ఆమె చేతిలో ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది.
అయితే ఈ రాక్షస పీడ వదిలింది అని సంతోషంతో దీపావళి వస్తుంది. నరక చతుర్దశి నాడు నరకాసురుడు బాధలు తొలగిపోతాయి. అందుకనే తర్వాత రోజు అయిన దీపావళి నాడు ఆనందంగా ప్రజలు పండగ చేసుకుంటారు.