వరల్డ్ కప్ ఫైనల్ కోసం అహ్మదాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ

-

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు వరల్డ్ కప్ ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్ విచ్చేశారు. కొద్దిసేపటి కిందటే ఆయన అహ్మదాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ్నించి తన కాన్వాయ్ తో స్టేడియానికి బయల్దేరారు. ఈ మ్యాచ్ లో విజేతకు ప్రధాని మోదీ వరల్డ్ కప్ ను బహూకరించనున్నారు. కాగా, ఫైనల్ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా పరుగులు చేసేందుకు చెమటోడ్చుతోంది. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోవడంతో భారీ షాట్లు కొట్టడం సాధ్యం కావడంలేదు.

కీల‌క మ్యాచులో భార‌త బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో ఆస్ట్రేలియా ముందు ఓ మోస్త‌రు ల‌క్ష్యం నిలిచింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా మొద‌ట బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 240 ప‌రుగుల‌కు ఆలౌలైంది. టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ (54; 63 బంతుల్లో 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (66; 107 బంతుల్లో 1 ఫోర్‌) లు హాఫ్ సెంచ‌రీలు చేశారు. రోహిత్ శ‌ర్మ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించాడు. మిగిలిన వారు విఫ‌లం కావ‌డంతో ఓ మోస్త‌రు స్కోరుకే భార‌త్ ప‌రిమిత‌మైంది. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ క‌మిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు. మాక్స్‌వెల్‌, జంపాలు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version