అభివృద్ధి, సహకారంలో భాగస్వామ్య దేశాలను గౌరవించడమే భారత విధానమన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. మారిషస్‌లో కొత్తగా నిర్మించిన సుప్రీంకోర్టును ఆ దేశ ప్రధాని ప్రవింద్ జుగ్నౌథ్తో కలిసి దిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు మోదీ. పొరుగు దేశాల అభివృద్ధికి సహకరించడంలో ఎలాంటి నిబంధనలు ఉండవని చెప్పారు.
మారిషస్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత్‌కు గుండె వంటిదన్నారు మోదీ. భారత్, మారిషస్ ప్రజాస్వామ్యానికి స్వతంత్ర న్యాయ వ్యవస్థలు మూలస్తంభాల వంటివని పేర్కొన్నారు. మారిషస్ ప్రభుత్వం కరోనాపై దీటుగా పోరాడుతోందని చెప్పారు.అఫ్గానిస్థాన్‌లో పార్లమెంట్ భవనాన్ని నిర్మించేందుకు కృషి చేశామని.. నైగర్‌లో మహాత్మాగాంధీ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించడం పట్ల గర్విస్తున్నామని తెలిపారు మోదీ.ఈ సందర్భంగా ప్రసంగించిన మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్నౌథ్ భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. మారిషస్ దేశం, ప్రజలు భారత్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.