కరోనా పై పోరులో కీలక ఘట్టం లో ఉన్న భారత్: మంత్రి హర్షవర్ధన్‌

-

కోవిడ్ -19 నేపథ్యంలో ప్రపంచం మొత్తం వణికిపోతుంది. వ్యాక్సిన్ కనిపెట్టే ప్రయత్నం లో అన్ని దేశాలు నిమగ్నమై ఉన్నాయి.ఇప్పటికే అనేక దేశాలు క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. భారతదేశంలో కూడా ఈ క్లినికల్ ట్రయల్స్ ముందంజలో ఉన్నాయి.భారతీయ కంపెనీలు, శాస్త్రవేత్తలు ఎంతో గొప్పగా కృషి చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. భారతదేశంలో రెండు కంపెనీలు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకోవడం గర్వకారణమని తెలిపారు.కరోనా ఉపశమన చర్యలకై కంపెనీలు, శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయత్నాలు, ప్రయోగ దశ ఫలితాలకు సంబంధించిన వివరాలతో కూడిన.. ‘కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌, ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌ టెక్నాలజీస్‌ ఫర్‌ కోవిడ్‌-19 మిటిగేషన్‌’’ కంపెడియంను ఆవిష్కరించారు. కరోనా పై జరుగుతున్న పొరులో అలుపెరుగక కృషి​ చేస్తున్న వైద్య నిపుణులపై ప్రశంసలు కురిపించారు. దాదాపు 150 దేశాలకు యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేయడంలో పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయన్నారు.

Harshavardhan

కరోనా అభివృద్ధిలో రెండు భారతీయ కంపెనీలు ముందంజలో ఉండటం గొప్ప శుభసూచికం అన్నారు. ఐతే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్ ఇప్పటికే ‘కోవాక్సిన్‌’ మానవ పరీక్షలు ప్రారంభించగా‌, పుణే కేంద్రంగా పనిచేసే సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా.. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తున్న విషయం అందరికీ తెలుసు. భారతదేశంలో 10 లక్షల మందికి పైగా కరోనా బారినపడిన రోగులు పూర్తిగా కోలుకున్నారని తెలిపారు. మిగతా రోగులు కూడా త్వరలోనే కోలుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని.. ఇతర దేశాలతో పోలిస్తే మరణాల రేటు కూడా తక్కువగా ఉండటం సానుకూల అంశమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version