నాసా ‘మూన్ టు మార్స్’ ప్రాజెక్ట్ సారథిగా అమిత్​ క్షత్రియ

-

భారత సంతతికి చెందిన సాఫ్ట్​వేర్​, రోబోటిక్స్​ ఇంజినీర్​ అమిత్​ క్షత్రియ అరుదైన ఘనతను సాధించారు. అనాసా కొత్తగా చేపట్టిన ‘మూన్ టు మార్స్’ ప్రాజెక్టు​కు సారథ్య బాధ్యతలు నిర్వహించనున్నారు. నాసాలోని ముఖ్య విభాగానికి సారథిగా నియమితులైన మొదటి భారత సంతతి వ్యక్తి అమిత్​ క్షత్రియనే. వాషింగ్టన్‌లోని నాసా ప్రధాన కార్యాలయంలోనే.. అమిత్ సారథ్యంలో పనిచేసే ‘మూన్ టు మార్స్’ విభాగం ఉంటుంది.

“మానవాళి ప్రయోజనాల కోసం చంద్రుడు, అంగారక గ్రహాలపై నాసా తలపెట్టిన మానవ అన్వేషణ కార్యకలాపాలను నిర్వహించడం ఈ నూతన ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. మూన్ టు మార్స్ ప్రోగ్రామ్ చంద్రుడిపై మా సాహస ప్రయోగాలను నిర్వహించడానికి.. అలాగే అంగారక గ్రహంపై మొదటిసారి మానవులను దింపడానికి నాసాను సిద్ధం చేయడంలో సహాయపడుతుంది.” అని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఒక ప్రకటనలో తెలిపారు.

‘మూన్​ టూ మార్స్’​ ప్రోగ్రాం సారథి​గా నియమితులైన అమిత్​ క్షత్రియ వీటికి సంబంధించి అనేక కార్యక్రమాల్లో నాయకత్వం వహిస్తూ కీలక పాత్రను పోషించనున్నారు. ఈ ప్రాజెక్ట్​ ప్రణాళికల రూపకల్పనతో పాటు వాటి అమలులో కూడా అమిత్ నిర్ణయాలే ముఖ్య భూమిక పోషించనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version