యాషెస్ సిరీస్ 2023: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్… మ్యాచ్ విన్నర్ దూరం!

-

ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన ప్రతి సంవత్సరం జరిగే యాషెస్ టెస్ట్ సిరీస్ వారి పరువుకు ప్రతీకగా భావిస్తారు. కాగా ఈ సారి జరుగుతున్న యాషెస్ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు పూర్తి కాగా.. రెండింటిలోనూ ఆస్ట్రేలియా విజయాన్ని సాధించి సిరీస్ 2 – 0 తో దూసుకువెళ్లింది. కాగా ఇక మిగిలిన మూడు మ్యాచ్ లను ఇంగ్లాండ్ గెలిస్తేనే సిరీస్ వారి సొంతం అవుతుంది.. కాగా మంచి ఊపుమీదున్న ఆస్ట్రేలియాకు తాజాగా భారీ షాక్ తగిలింది. వారి విజయాలలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన మిస్టరీ స్పిన్నర్ నాథన్ లియాన్ గాయం కారణంగా మొత్తం యాషెస్ సిరీస్ కె దూరమయ్యాడు. రెండవ టెస్ట్ లో గాయపడిన లియాన్ కు వైద్య పరీక్షలు చేయగా గాయం తీవ్రత ఎక్కవ అని రిపోర్ట్ లు రావడంతో తప్పని సరి పరిస్థితుల్లో జట్టుకు దూరం అయ్యాడు.

మొదటి టెస్ట్ లో ఎనిమిది వికెట్లు తీసిన లయన్ జట్టు విజయంలో కీలకం అయ్యాడు. ఇతని లేని లోటు ఆస్ట్రేలియా కు గట్టి దెబ్బె అని చెప్పాలి, కాగా ఇతని స్థానంలో టాడ్ మర్ఫీ జట్టులోకి రానున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version