మహారాష్ట్రలో మొత్తం రూ.1082.2 కోట్లు సీజ్.. ఈసీ ప్రకటన

-

మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళ ప్రచారం ముగిసింది. ఈ రెండు రాష్ట్రాలలో అధికారులు భారీ నగదును సీజ్ చేశారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేవిధంగా పలు రాజకీయ పార్టీలు చేసే ప్రయత్నాలను అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక  బృందాలు 1082 కోట్లు విలువైన వాటిని సీజ్ చేశాయని కేంద్ర ఎన్నికల సంగం తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న స్థానాలలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. 

ఇందులో భాగంగానే ఇప్పటివరకు మొత్తంగా రూ.1082.2 కోట్ల తాయిలాను స్వాధీనం చేసుకున్నట్టు ఈసీ తెలిపింది. సీజ్ చేసిన దాంట్లో రూ.181.97 కోట్ల నగదు కాగా.. రూ.119.83 కోట్ల విలువ చేసే మద్యం, రూ.123. 57 కోట్లు విలువైన మాదకద్రవ్యాలు, రూ.302.08 కోట్ల విలువైనటువంటి ఆభరణాలున్నాయి. రూ.354.76 కోట్ల విలువైన ఉచితాలు, ఇతర వస్తువులు ఉన్నట్టు పేర్కొంది. ఈనెల 20న పోలింగ్ జరుగనున్న వేళ రాబోయే రెండు రోజులు నిఘా ఉంచనున్నట్టు తెలిపింది ఈసీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version