BREAKING: జంగ్పూరాలో మనీష్ సిసోడియాకు బిగ్ షాక్ తగిలింది. జంగ్పూరాలో మనీష్ సిసోడియా ఓటమి పాలయ్యారు. సిసోడియాపై బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ గెలిచారు. 600 ఓట్ల తేడాతో సిసోడియా ఓటమి పాలయ్యారు.. సిసోడియాను జైలుకు వెళ్లొచ్చిన సానుభూతి..గట్టెక్కించలేకపోయింది. దీంతో… తీవ్ర నిరాశకు గురయ్యారు సిసోడియా.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/sisodiya.jpg)
ఇక అటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ వచ్చింది. గత రెండు ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కే పరిమితమైన బీజేపీకి ఈసారి పూర్తి ఆధిక్యం సాధించింది. దీంతో… 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ వచ్చింది. అటు హ్యాట్రిక్ కొట్టలేకపోయిన ఆమ్ ఆద్మీ పార్టీ..రెండో అతిపెద్ద పార్టీలో ఢిల్లీ ఎన్నికల్లో నిలిచింది. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో 9 రౌండ్లు ముగిశాక 1,170 ఓట్ల వెనుకంజలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.. ఒక్క నియోజకవర్గంలో కూడా ఆధిక్యంలో లేని కాంగ్రెస్ డీలా పడింది. ఇక అటు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో అధికారంలోకి బీజేపీ రావడంతో… బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.