Mohammed Shami : మహమ్మద్ షమీతో ‘ఊసరవెల్లి’ బ్యూటీ పెళ్లి !

-

Mohammed Shami :  టీమిండియా బౌలర్ మహ్మద్ షమీనీ పెళ్లి చేసుకుంటానంటూ నటి పాయల్ ఘోష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. వన్డే ప్రపంచ కప్-2023లో టీమిండియా స్టార్ పెసర్ మహ్మద్ షమీ దుమ్ము లేపుతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు కేవలం నాలుగు మ్యాచ్లు మాత్రమే ఆడిన షమీ 16 వికెట్లు పడగొట్టి సిరీస్ లో టాప్ 5 బౌలర్ లిస్ట్ లో చేరారు. అలా భారత్ విజయాల్లో షమీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఇండియా మొత్తం షమీ పేరు మారు మ్రోగుతుంది. తాజాగా సోషల్ మీడియాలో షమీ పెళ్లి గురించి పెద్ద చర్చ జరుగుతుంది.

Actress Payal Ghosh proposes Mohammed Shami to be his Second Wife

షమీనీ పెళ్లి చేసుకుంటానంటూ నటి పాయల్ ఘోష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ‘షమీ…. నీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకో. నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ’ అని ఆమె తన ట్వీట్ లో పేర్కొన్నారు. దీనిపై అతను స్పందించలేదు. పలువురు నెటిజన్లు మాత్రం ఆమెపై ఫైర్ అవుతున్నారు. ‘పెళ్లికి ఇంగ్లీషుతో పనేంటి? ఇంగ్లీష్ వస్తేనే పెళ్లి చేసుకుంటారా? ఎందుకు ఎగతాళి చేస్తున్నారు?’ అంటూ మండిపడుతున్నారు. కాగా.. నటి పాయల్ ఘోష్ ఊసరవెల్లి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version