ఓటుకు నోటు కేసు నాకు మెడల్ లాంటిదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలోనే… తాజాగా రేవంత్ రెడ్డి ఓ ఇంగ్లీష్ ఛానెల్ కు ఇంటర్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..యువత 24 గంటలు కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తామన్నారు.
మేం అధికారంలోకి వస్తే కూరగాయలు రోడ్డు మీద అమ్ముకునే దుస్థితి లేకుండా మూసీ నది చుట్టూ యువత 24 గంటలు రోజుకు 3 షిఫ్టుల చొప్పున కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుందని చెప్పారు రేవంత్ రెడ్డి. అమరావతి తరహాలో హైదరాబాద్ నగరంలో రాచకొండలో 50 వేల ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి కొత్త సిటీ క్రియేట్ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.
ఇది ఇలా ఉండగా… ఐటీ దాడులపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఐటీ దాడులకు భయపడేది లేదు..పాలేరు అభ్యర్థిపై ఐ.టి అధికారులు పెద్దఎత్తున దాడులు చేస్తూ భయపెట్టాలని చూస్తున్నారన్నారు. ఇది బిఆర్ఎస్, బీజేపీ కలిసి చేస్తున్న రాజకీయ కుట్ర… ఇలాంటి రాజకీయ బెదిరింపులకు కాంగ్రెస్ నాయకులు భయపడరని వెల్లడించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అంత అండగా ఉంటుందని స్పష్టం చేశారు.