ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక కోసం సర్వం సిద్ధం అవుతున్నాయన్నారు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్ట్రీ. రాష్ట్రాల్లోని అన్ని పిసిసి కార్యాలయాల్లో ఓటింగ్ కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రతినిధులందరికి పార్టీ గుర్తింపు కార్డుల ప్రక్రియ కొనసాగనుందన్నారు. ఐడెంటిటీ కార్డుపై క్యూ ఆర్ కోడ్ ఉంటుందని.. ఐడి కార్డుపై ఫోటో లేకుండా ఉంటే ఆధార్ కార్డు తప్పనిసరి అన్నారు. ఈ నెల ఇరవై తర్వాత ఓటర్ లిస్ట్ అందుబాటులో పెడతామన్నారు.
నిన్న ప్రదేశ్ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించామని.. ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక పారదర్శకంగా జరగనుందన్నారు. ఎవరూ ఎటువంటి, అపోహలు అనర్ధాలకు పోవాల్సిన అవసరం లేదన్నారు. ఏఐసీసీ అధ్యక్ష పదవికి ఒక్కరి కంటే ఎక్కువ పోటీ పడితే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఏఐసీసీ అధ్యక్షులు ఎన్నికల షెడ్యూల్ ఈ విధంగా ఉంది.. నోటిఫికేషన్ 22 సెప్టెంబర్, నామినేషన్లు 24 సెప్టెంబర్, నామినేషన్లకు చివరి రోజు 30 సెప్టెంబర్, ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక 17 అక్టోబర్.