Air pollution in Delhi is dangerous: ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. దీంతో పాఠశాలలకు సెలవులు, కొన్ని వాహనాలపై నిషేధం విధించారు. గ్యాస్ ఛాంబర్ లా మారిన ఢిల్లీలో జనాలు ఇబ్బంది పడుతున్నారు. ఢిల్లీ ఎన్సీఆర్ లో ప్రైమరీ స్కూళ్ళు మూతపడ్డాయి. కాలుష్య తీవ్రత పెరగడంతో గ్రాఫ్ 3 చర్యల్లో భాగంగా ప్రైమరీ పాఠశాలలు మూసివేస్తున్నట్లు వెల్లడించింది విద్యాశాఖ. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆన్ లైన్ తరగతులు కొనసాగించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలో అత్యంత దారుణంగా వాయు కాలుష్యం నెలకొన్న తరుణంలో… ఎయిర్ క్వాలిటీ భారీగా పడిపోయింది. దీంతో నేటి ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు రానున్నాయి. నిర్మాణ పనులు , కూల్చివేతలు నిలిపివేయాలని సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీలోకి జీఎస్ 3 వాహనాలు , డీజీల్ వాహనాల ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది ఢిల్లీ సర్కార్.