నేడు అఖిల పక్ష సమావేశం జరుగనుంది. పార్లమెంట్ భవనానికి అనుబంధంగా ఉన్న భవనంలోని (పార్లమెంట్ అనెక్స్) “మెయున్ కమిటీ రూమ్”లో ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు ఆధ్వర్యంలో జరిగే “అఖిలపక్ష సమావేశానికి” ఉభయ సభల్లోని వివిధ పక్షాల నాయకులు హాజరుకానున్నారు. శీతాకాల సమావేశాల నేపథ్యంలో వివిధ పక్షాల నాయకుల అభిప్రాయాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు తెలుసుకోనున్నారు.
అటు రేపటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. దీంతో “ఒక దేశం-ఒకే ఎన్నిక”, “వక్ఫ్” బిల్లులకు చట్టరూపం ఇవ్వాలనే సంకల్పంతో మోడి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. పాత పార్లమెంటు భవనం లోని సెంట్రల్ హాల్‌లో వచ్చే మంగళవారం “75వ భారత రాజ్యాంగ దినోత్సవం” నిర్వహించనున్నారు. ప్రస్తుతం, “పార్లమెంటరీ సంయుక్త కమిటీ” “వక్ఫ్ సవరణ బిల్లు-2024” పరిశీలనలో ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలలో దీనిపై ఓ నిర్ణయం తీసుకోనున్నారు.