ఆయుధాలు కనిపించాయో.. అంతే సంగతులు : అమిత్ షా వార్నింగ్

-

మణిపుర్​లో అమిత్ షా నాలుగు రోజుల పర్యటన ముగిసింది. మణిపుర్​లో నెలకొన్న పరిస్థితులపై విచారణకు త్వరలోనే విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు.  ఈ అల్లర్ల వెనుక ఉన్న కుట్రలపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కూడా విచారణ చేపడుతుందని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించేవారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం చర్చలే ఈ సమస్యకు పరిష్కారమని షా తేల్చి చెప్పారు. మయన్మార్-మణిపుర్ సరిహద్దును సురక్షితంగా ఉంచుతామని చెప్పారు.

“మేము “సూ” గ్రూపు వారికి కఠిన హెచ్చరిక జారీచేస్తున్నాం. సూ ఒప్పందాన్ని ఏ రకంగానైనా ఉల్లంఘించినా, ఒప్పందం నుంచి తప్పుకున్నా నిబంధనలు ఉల్లఘించినట్లే. ఒప్పందంలోని అన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాలి. ఈ అంశాన్ని మేము కఠినంగా పర్యవేక్షిస్తాం. ఆయుధాలు కలిగి ఉన్న వారు.. వాటిని పోలీసులకు అప్పగించాలని కోరుతున్నాను. శుక్రవారం నుంచి పోలీసులు కూంబింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. తర్వాత ఎవరి దగ్గరైనా ఆయుధాలు ఉంటే కఠిన చర్యలు తీసుకుంటాం. మణిపుర్​-మయన్మార్ సరిహద్దు సమస్యకు శాశ్వత పరిష్కారం కంచె వేయడమే.” అని అమిత్ షా అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version