బ్రిటన్ నూతన ప్రధాన మంత్రిగా రిషి సునాక్ నియామకం పట్ల యావత్ ఇండియా హర్షం వ్యక్తం చేస్తోంది. రిషిపై ఇండియన్ సోషల్ మీడియాలో ప్రశంసలు, శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రధాన మంత్రి సహా ఇతర రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు రిషి సునాక్ కు అభినందనలు తెలిపారు. తాజాగా ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా కూడా రిషి సునాక్‌ను ప్రశంసించారు. ఆయన సామర్థ్యాలపై విశ్వాసం వ్యక్తం చేశారు.
‘రిషి ముందు భయానకరీతిలో సవాళ్లు కుప్పగా పేర్చి ఉన్నాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో ఆయన విజయం సాధించొచ్చు, విఫలం కావొచ్చు. అది ఆయనలో సత్తా లేకపోవడం వల్ల కాదు. అతను సూపర్ స్మార్ట్. సునిశిత దృష్టి కలవారు. ఆచితూచి ఎంతో పొందికగా మాట్లాడగల నేర్పరి’ అంటూ ప్రశంసించారు. బ్రిటన్ ప్రధానిగా నియమితులైన అనంతరం రిషి మీడియాతో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు.
బ్రిటన్ నూతన ప్రధానమంత్రిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ మంగళవారం బాధ్యతలు చేపట్టారు. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కించడమే రిషి ముందున్న అతిపెద్ద సవాల్. కాగా, ప్రస్తుతం దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నదని, కఠిన నిర్ణయాలు తప్పవని తన తొలి ప్రసంగంలో రిషి పేర్కొన్నారు. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న బ్రిటన్‌కు తిరిగి పూర్వవైభవం తేవటమే తన మొదటి లక్ష్యమన్నారు.
The odds are stacked horrendously against him. But whether he succeeds or fails, it won’t be for the lack of ‘raw material.’ This young man is super-smart, super-articulate and super-focused…#RishiSunak https://t.co/24HkrHftKo
— anand mahindra (@anandmahindra) October 25, 2022