‘సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌’.. ఆన్‌లైన్‌ ట్రెండ్‌లో చేరిన అసోం సీఎం

-

‘సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’ అంటూ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో విపరీతంగా ట్రెండ్ అవుతున్న వీడియో ఇది. ఓ  వస్త్ర దుకాణంలో ఓ మహిళ ఈ డైలాగ్ తో చేసిన సందడి ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది. చాలా మంది ఈ రీల్ ను ఇప్పుడు రీ క్రియేట్ చేసి మరింత ట్రెండ్ చేస్తున్నారు. అయితే తాజాగా అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఈ ట్రెండ్ లో చేరిపోయారు. ఆయన కూడా సో బ్యూటీఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ ఓ పోస్టు పెట్టారు. అయితే ఆయన పోస్టు పెట్టింది అసోంలోని హిమాలయాలతో కూడిన ఓ వంతెన గురించి.

‘‘ఇది.. తేజ్‌పుర్‌లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ‘కోలియా భోమోర వంతెన’.  చలికాలం ఉదయాన వంతెన వద్ద నుంచి హిమాలయాలూ కనిపిస్తున్నాయి. ఎంత మహత్తర దృశ్యం ఇది. తక్కువ వాయునాణ్యత సూచీ (ఏక్యూఐ), కాలుష్య రహిత వాతావరణం కారణంగా.. అరుణాచల్- టిబెట్ సరిహద్దు సమీపంలోని ఈ పర్వత శ్రేణులు స్పష్టంగా దర్శనమిస్తున్నాయి. ‘సో బ్యూటిఫుల్‌.. సో ఎలిగెంట్‌.. జస్ట్‌ లుకింగ్‌ లైక్‌ ఏ వావ్‌’’ అంటూ హిమంత ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఈ ఫొటోలు కాస్త ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version