మళ్లీ నోరు పారేసుకున్న ట్రూడో.. వియన్నా ఒప్పందం ఉల్లంఘిస్తున్నారంటూ భారత్ పై ఆరోపణలు

-

కెనడా ప్రధాని ట్రూడో మరోసారి భారత్ పై నోరు పారేసుకున్నారు. వియన్నా ఒప్పందాన్ని న్యూదిల్లీ ఉల్లంఘిస్తోందని ఆరోపణలు చేశారు. తమ దేశం చట్టబద్దపాలన కోసం పనిచేస్తుందంటూ.. మరోసారి ఖలిస్థానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఈ హత్య కేసులో నిజానిజాలను తేల్చేందుకు భారత్‌, మిత్రదేశాలైన అమెరికాతో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్నామని..  భారత్ మాత్రం తమ దౌత్యవేత్తలను గెంటేసిందని వ్యాఖ్యానించారు.

లా, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలు వాటి పని అవి చేస్తున్నాయన్న ట్రూడో..  కెనడా చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఎటువంటి పరిణామాలు ఎదుర్కోకుండా పెద్ద దేశాలు చట్టాలను ఉల్లంఘిస్తే భవిష్యత్తులో ప్రపంచమంతా ప్రమాదంలో పడుతుందని చెప్పుకొచ్చారు. మరోవైపు .. భారత్‌ వియన్నా ఒప్పందాన్ని పూర్తిగా ఉల్లంఘించిందని ట్రూడో ఆరోపణలు చేశారు. తమ దౌత్యవేత్తలను అన్యాయంగా వెనక్కి పంపడం.. తనను పూర్తిగా నిరాశపర్చిందని అన్నారు. తమ వైపు నుంచి ఒక్కసారి ఆలోచించాలని కోరారు. నిజ్జర్ హత్య కేసులో భారత్​ ఏజెంట్ల పాత్ర ఉందని చెప్పడానికి తమ దగ్గర బలమైన కారణాలున్నాయని.. కానీ, దీనికి భారత్ స్పందిస్తూ.. వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించి.. తమ దౌత్యవేత్తలను గెంటేసిందంటూ ఆరోపించారు. ఈ విషయం ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version