మైసూర్ లో దారుణం జరిగింది. ఓకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మైసూరులోని విశ్వేరయ్యనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కుశాల్ 15, చేతన్ 45, రూపాలి 43, ప్రియం వదా 65, ఆత్మహత్య చేసుకున్నారు. మొదట, చేతన్ తన తల్లి, భార్య మరియు కొడుకును విషం ఇచ్చి హత్య చేసినట్లు సమాచారం అందుతోంది.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2024/07/sucide.webp)
ఆపై ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. నలుగురి మృతికి కచ్చితమైన కారణాలు తెలియరాలేదని సమాచారం. విద్యారణ్యపురం పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఎస్పీ మోహిత్, డీసీపీ జన్హానీ, పోలీస్ కమిషనర్ సీమా లత్కర్ ఉన్నారు. మృతిపై పోలీస్ విచారణ ప్రారంభమైంది. ఇక ఈ సంఘటన పైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.