యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. తొలి టెస్ట్ లో రెండు వికెట్ల తేడాతో ఇంగ్లాండుపై విజయం సాధించింది. 281 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు మంగళవారం ఓవర్ నైట్ స్కోరు 107/3 తో రెండో ఇన్నింగ్స్ ను కొనసాగించిన ఆస్ట్రేలియా 92.3 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసి గెలిచింది.
ఆఖరి రోజు ఆసీస్ విజయానికి 174 పరుగులు అవసరం కాగా… ఆశలు పెట్టుకున్న ప్రధాన బ్యాటర్స్ ట్రెవిస్ హెడ్, గ్రీన్, ఉస్మాన్ క్వాజా కీలకమైన తరుణంలో ఇంగ్లాండ్ బౌలింగ్ కు తలవంచారు. ఫామ్ లో ఉన్న క్యారీ అవుట్ అయినప్పుడు ఆసీస్ కోరు 227/8. లక్ష్యానికి 54 పరుగుల దూరం. మిగిలిందల్లా టేయిలెండర్లే కావడంతో ఆసీస్ పై ఆసీస్ కే గెలుస్తామన్న ఆశలు లేవు. ఈ దశలో కమిన్స్, లయన్ ఇంగ్లాండ్ కట్టుదిట్టమైన బౌలింగ్ ను ఎదుర్కొని వికెట్ల ముందు గోడ కట్టి మరీ గెలిచేందుకు పరుగు… పరుగు జతచేశారు.