అయోధ్య మందిరం కట్టిన తర్వాత అనేక వివాదాలు ఆ రామ మందిరం చుట్టే తిరుగుతున్నాయి. అయితే..తాజాగా మరోసారి అయోధ్య మందిరం వార్తల్లో నిలిచింది. అయోధ్య మందిరం వద్ద ఏర్పాటు చేసిన విలువైన లైట్లు దొంగతనం చేశారట.
రూ.50 లక్షల విలువైన లైట్లు దొంగతనం చేశారట. వాస్తవంగా అయోధ్యలో రామాలయ నిర్మాణం అనంతరం మందిర పరిసర ప్రాంతాలను సుందరంగా ముస్తాబు చేసింది ఉత్తర ప్రదేశ్ లోని ప్రభుత్వం. భక్తిపథం, రామపథం మార్గాల్లో వెదురు స్తంభాలకు లైట్లను అమర్చిడం జరిగింది.
అయితే… వాటిలో 3800 వెదురు స్తంభాల లైట్లను, 36 గోబో ప్రొజెక్టర్ లైట్లను దొంగతనం చేశారట. వీటి విలువ సుమారు రూ.50 లక్షల వరకు ఉంటుందని ఆలయ ట్రస్టు వాళ్ళు పోలీసులకు తెలిపారు.. ఫిర్యాదు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నారు పోలీసులు.