రాజ్యసభలో డబ్బుల కలకలం నెలకొంది. దీంతో రాజ్యసభలో డబ్బుల దుమారం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ సీటు వద్ద డబ్బులు దొరికాయినట్లు తాజాగా ప్రకటన వెలువడింది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ అధికారిక ప్రకటన చేశారు.
ఈ విషయంలో విచారణ జరుగుతోందని ప్రకటించారు రాజ్యసభ చైర్మన్. నిన్న అభిషేక్ సింఘ్వీ సీటు వద్ద దొరికినట్లు తెలిపిన రాజ్యసభ చైర్మన్.. విచారణ ప్రారంభించినట్లు వెల్లడించారు. అయితే.. ఈ డబ్బులు ఎవరికి సంబంధించినవి…దాని వెనుక ఎవరు ఉన్నారు… ఎందుకు రాజ్యసభకు తీసుకువచ్చారు. అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఇక అభిషేక్ సింఘ్వీ సీటు వద్ద దొరికినట్లు రాజ్యసభ చైర్మన్ తెలిపడంతో.. ఆయనపై అనేక అనుమానాలు వస్తున్నాయి. దీని వెనుక అభిషేక్ సింఘ్వీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.