సైఫ్ అలీఖాన్ పై దాడీ కేసులో బిగ్ ట్విస్ట్

-

సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సైఫ్ కేసును సవాలుగా తీసుకున్న ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నిందితుడిని గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారని, అతడు పోలీసుల అదుపులోనే ఉన్నాడని, విచారణలో సంచలన విషయాలు బయటికి వచ్చాయి అంటూ పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే.

అయితే ఈ ప్రచారం అంతా అవాస్తవమని బాంద్రా పోలీసులు స్పష్టం చేశారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. నేడు ఉదయం బాంద్రా పోలీస్ స్టేషన్ లో ఓ అనుమానితుడిని విచారించామని తెలిపారు. పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చిన వ్యక్తికి.. ఈ దాడితో ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.

సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసింది వీడియోలో ఉన్న వ్యక్తి కాదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అయితే దాడికి పాల్పడిన నిందితుడు గురువారం బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో కనబడినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడి కోసం పోలీసులు వసాయ్ తో పాటు పాల్గర్ జిల్లాలోని నాలాసోపార లో కూడా గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version