BREAKING : పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌: మోదీ

-

దిల్లీలోని బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ సంకల్ప పత్ర పేరుతో లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. బీజేపీ మేనిఫెస్టోను యువత, పేదలను దృష్టిలో పెట్టుకొని తయారు చేసినట్లు తెలిపారు. ఈ పదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తెచ్చామని అన్నారు. వచ్చే ఐదేళ్ల పాటు కూడా ఉచిత రేషన్‌ ఇస్తామని ప్రకటించారు. 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు రూ.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తామన్న ప్రధాని.. పేదలకు 4 కోట్ల ఇళ్లు కట్టించామని, మరో 3 కోట్ల గృహాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

మరోవైపు ఈ మేనిఫెస్టోలు గృహిణులకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రధాని మోదీ. భవిష్యత్తులో పైపులైన్‌ ద్వారా ఇంటింటికీ గ్యాస్‌ అందిస్తామని ప్రకటించారు. పీఎం సూర్య ఘర్‌ పథకానికి కోటిమంది రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. ఇంట్లో తయారైన కరెంట్‌ను మీరు అమ్ముకోవచ్చని చెప్పారు. ముద్ర పథకం కింద కోట్లమందికి స్వయం ఉపాధి లభించిందని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version