బిజెపి నూతన కేంద్ర ఎన్నికల కమిటీ ఏర్పాటు

-

బిజెపి పార్లమెంటరీ బోర్డును నియమించారు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. బిజెపి కొత్త పార్లమెంటరీ బోర్డును ఏర్పాటు చేశారు. ఈ నూతన బోర్డు నియామకంలో పార్టీలో సీనియర్లు అయిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రి నితిన్ గట్కరీలకు చోటు లభించలేదు. వీరిద్దరిని సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి కూడా తొలగించడం గమనార్హం. తెలంగాణ నుంచి ఎంపీ లక్ష్మణ్‌కు లభించింది.

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యులుగా ప్రధాని మోడీ, రాజ్‌నాథ్‌, యడ్యూరప్ప, శర్భా నంద్ సోనావాల్, కె. లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్, సత్యనారాయణ జటీయా, బీఎల్ సంతోష్‌ను నియమించారు జేపీ నడ్డా. అలాగే  ఎన్నికల కమిటీకి అధ్యక్షుడుగా నడ్డా సభ్యులుగా.. ప్రధాని మోడీ, రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, యడ్యూరప్ప, శర్భా నంద్ సోనా వాల్, కె లక్ష్మణ్, ఇక్బాల్ సింగ్, సుధా యాదవ్, సత్యనారాయణ జటీయా, బూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫండవిస్, హోం మాధుర్, వనతి శ్రీనివాస్, బి ఎల్ సంతోష్ ని నియమించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version