చిచ్చర పిడుగు ధైర్యానికి హ్యాట్సాఫ్.. గదిలోకి సడెన్గా వచ్చిన చిరుతను బంధించిన బుడతడు

-

మహారాష్ట్ర నాసిక్‌ జిల్లాలో ఓ 12 ఏళ్ల బాలుడు చూపిన ధైర్యానికి యావత్ భారత్ ఫిదా అయింది. ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో ఆ బుడతడి తెగింపును చూసి నెటిజన్లు హ్యాట్సాఫ్ అంటున్నారు. ఇంతకీ ఆ బుడతడు ఏం చేశాడంటే?

మహారాష్ట్రంలోని మాలెగావ్‌ పట్టణంలో మోహిత్‌ విజయ్‌ అనే పిల్లాడు తన ఇంట్లోని ఆఫీస్ క్యాబిన్లో కూర్చొని మొబైల్‌ ఫోన్లో ఆడుకుంటున్నాడు. అతడు కూర్చున్న గదిలోకి అకస్మాత్తుగా ఓ చిరుతపులి ప్రవేశించింది. గమనించిన పిల్లాడు ఏ మాత్రం జంకకుండా నెమ్మదిగా మొబైల్ ఫోన్ తీసుకుని గదిలో నుంచి బయటకు వెళ్లి తలుపులు పెట్టాడు. అనంతరం తల్లిదండ్రుల సాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది ఆ చిరుతకు మత్తుమందు ఇచ్చి స్పృహ కోల్పోయేలా చేసి అనంతరం సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేశారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version