Breaking : ఏప్రిల్ 26 నుంచి CBSE ట‌ర్మ్-2 ప‌రీక్షలు

-

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) టర్మ్ 2 పరీక్షలను ఏప్రిల్ 26 నుండి నిర్వహించనున్నట్టు CBSE అధికారికంగా ప్ర‌క‌టించింది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు CBSE ప‌రీక్షపై నీలినిడాలు క‌మ్ముకున్నాయి. తాజా గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ట‌ర్మ్-2 ప‌రీక్షల‌ను నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది. అలాగే ప‌రీక్షల‌ను ఆఫ్ లైన్ లోనే ఈ ప‌రీక్షల‌ను నిర్వ‌హిస్తామ‌ని బోర్డు తెలిపింది. ఇటీవ‌ల ట‌ర్మ్-1 ప‌రీక్షలు నిర్వ‌హించింది.

అయితే ఈ పరీక్షల ఫ‌లితాలు ఇంకా వెలువ‌డ‌లేదు. ఈ ఫ‌లితాల ముందే టర్మ్ -2 ప‌రీక్షలు నిర్వ‌హించ‌నుంది. అలాగే ఈ ప‌రీక్షకు సంబంధించి న‌మూనా ప్ర‌శ్నా ప‌త్రాల‌ను వెబ్ సైట్ లో ఉంచ‌నుంది. అలాగే ప‌దో త‌ర‌గ‌తి, 12 వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీలు CBSE యొక్క అధికారిక వెబ్‌సైట్ cbseresults.nic.in లో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది. అలాగే విద్యార్థుల‌కు గ‌తంలో కేటాయించిన ప‌రీక్ష కేంద్రాలే ఉంటాయ‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version