త్వరలో కేంద్ర కేబినెట్​లో​ భారీ మార్పులు

-

కేంద్ర కేబినెట్​లో త్వరలోనే భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులపై చర్చించేందుకు.. ప్రధాని మోదీ పార్టీ నేతలతో బుధవారం అర్ధరాత్రి కీలక భేటీ నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు. దాదాపు ఐదు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.

వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. ఇక కేంద్ర మంత్రి వర్గంలోనూ భారీ మార్పులకు ఈ భేటీలో చర్చ జరిగినట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు త్వరలోనే రాష్ట్ర స్థాయుల్లో బీజేపీ అధ్యక్షుల్లో మార్పులు ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కేంద్ర మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉండొచ్చని సమాచారం. ఎన్నికలకు ముందు వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version