దేశంలోని మరో 5 భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వాలని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. వాటిలో ముఖ్యంగా మరాఠీ, బెంగాలీ, పాలీ, ప్రాకృతం, అస్సామీ భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ కల్పించాలని నిర్ణయించింది. క్యాబినెట్ నిర్ణయంతో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఉన్న భాషల సంఖ్య 6 నుంచి 11కి పెరిగింది. గతంలో తెలుగు, సంస్కృతం, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా భాషలకు మాత్రమే ఈ స్టేటస్ ఉండేది.
తాజాగా 5 భాషలు చేరడంతో ఇప్పుడు వీటి సంఖ్య దాదాపు రెట్టింపు అయిందనే చెప్పాలి. చివరగా 2004లో తమిళం, 2014లో ఒడియా భాషలకు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ దక్కింది. ప్రస్తుతం కొత్తగా వచ్చిన 5 భాషలకు ఈ హోదా ఇవ్వాలనే డిమాండ్ చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. మరాఠీ భాషకు అప్పటి ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ 2014లో భాషా నిపుణుల కమిటీని ఏర్పాటు చేవారు. మరాఠీని శాస్త్రీయ భాషగా గుర్తించడానికి అన్నీ ప్రమాణాలు ఉన్నాయని ప్యానెల్ పేర్కొంది. ఈ నివేదికను కేంద్రానికి పంపింది. తాజాగా మరాఠీతో పాటు మరో నాలుగు భాషలకు క్లాసికల్ స్టేటస్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.