వ్యాక్సిన్ పంపిణీకి ప్లాన్ రెడీ చేసిన కేంద్రం

-

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాన్ని పంపిణీ ఎలా చేయాలి అనే అంశం మీద కేంద్రం ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ కరోనా వ్యాక్సిన్ వేయడానికి ఆరోగ్య కేంద్రాలనే కాక అంగన్వాడీ కేంద్రాలను కూడా ఉపయోగించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇవి కాక పాఠశాల భవనాలను అలానే ఊర్లలో ఉన్న పంచాయతీ భవనాలు కూడా పంపిణీకి వాడుకోవాలని కేంద్రం యోచిస్తోంది. ఎవరెవరికి టీకాలు వేశారు ? వేసిన వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడు డిజిటల్ విధానం ద్వారా ట్రాక్ చేయనున్నారు.

నిపుణుల బృందం ఈ మేరకు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం వ్యాక్సిన్ బూత్ లు ఏర్పాటు చేయాల్సిన భవనాలు ఎలా ఉండాలి అనే విషయాన్ని ఆయా రాష్ట్రాలు గుర్తించాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ని బట్టి ఒక్క మనిషికి ఒక్క సారే ఈ టీకా లభించేలా కేంద్రం ప్లాన్ చేస్తోంది. ఒక వేళ ఆధార్ లేనట్లయితే ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన ఏదైనా కార్డు చూపిస్తే వారిని కూడా పోటీకి అర్హులుగా గుర్తిస్తారు. ముందే రిజిస్టర్ చేసేలా, ఈ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక ఏ కేంద్రానికి ఏ రోజున ఏ సమయానికి చేరు కోవాలి అనేది ముందే ఎస్ఎంఎస్ ద్వారా పంపిణీ కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version