ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న తెలుగు యాత్రికులు

-

భారత్​లో అత్యంత ప్రమాదకరమైన యాత్రలు అంటే ముందుగా గుర్తొచ్చేది అమర్​నాథ్, చార్​ధామ్ యాత్రలే. ఈ యాత్రలకు వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చారంటే.. ఇక వాళ్ల తమ జీవితంలో ఎంతటి కష్టాన్నైనా సులువుగా ఎదుర్కోగలుగుతారని అర్థం. ఎందుకంటే.. ఎన్నో క్లిష్టమైన అడ్డంకులను దాటుకుంటూ ఈ యాత్రకు వెళ్లాల్సి ఉంటుంది. ఇక అకస్మాత్తుగా మంచు పడటం.. కొండచరియలు విరిగిపడటం.. భారీ వర్షాలు.. ఇలా రకరకాల విపత్తులతో ఇప్పటికే చాలా మంది యాత్రికులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి.

తాజాగా చార్ ధామ్ యాత్రకు వెళ్లిన పలువురు యాత్రికులు ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్నారు. గత రెండ్రోజులుగా కురిసిన వర్షాలకుఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ క్రమంలో రుషికేశ్‌కు 40 కి.మీ. దూరంలో వేలమంది యాత్రికులు చిక్కుకున్నారు. సోమవారం నుంచి రోడ్డుపైనే యాత్రికులు, స్థానికుల పడిగాపులు కాస్తున్నారు. కొడియాల వద్ద 1500 వాహనాలు, 20 వేలమంది పడిగాపులు కాస్తున్నారు. ఈయాత్రికుల్లో బెంగళూరు, ఏపీ నుంచి వెళ్లిన పలువురు తెలుగు వాసులు ఉన్నారు. త్వరగా సహాయక చర్యలు చేపట్టాలని యాత్రికులు విజ్ఞప్తి ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version