దిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

-

దిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి సీఎం అర్వింద్ కేజ్రీవాల్కు మరోసారి కోర్టులో చుక్కెదురైంది. ఈ కేసులో నమోదు చేసిన కేసులో బెయిల్‌ కోసం దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోరుతూ సీఎం కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించాలని సీబీఐని జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణ ఆదేశించారు. కేజ్రీవాల్ తరఫున వాదనలు వినిపించిన సీనియన్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ దిల్లీ సీఎం ఎక్కడకూ పారిపోవడం లేదనీ .. ఆయనేం ఉగ్రవాది కాదనీ ఈడీ-మనీలాండరింగ్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత సీబీఐ అరెస్టు చేసిందని పేర్కొన్నారు.

బెయిల్‌ కోసం కేజ్రీవాల్ ట్రయల్ కోర్టులో కాకుండా నేరుగా హైకోర్టును ఆశ్రయించడంపై సీబీఐ తరఫున న్యాయవాది డీపీ సింగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. వాదనల అనంతరం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై విచారణను జులై 17వ తేదీకి దిల్లీ హైకోర్టు వాయిదా వేసింది. మద్యం కుంభకోణంలో ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్‌ కేసు కారణంగా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను సీబీఐ జూన్‌ 26న తిహాడ్‌ జైలులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version